హైదరాబాద్ ఏప్రిల్ 14 (ఈతరం భారతం);భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వ వ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలంగాణ బిసి విద్యార్థి సంఘం రాస్ట్ర అద్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొన ట్యాంక్‌బoడ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ డబ్బు, అధికారం ,కులం, మతం అన్ని రంగాల్లో పెత్తనం చెలాయిస్తున్న నేటి పరిస్థితుల్లో అంబెడ్కర్ ఆశయాలను మరింత నిబద్ధతతో అమలు చేయాల్సిన అవసరామ్ ఎంతైనా ఉందన్నారు.రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని అఅవీడన వ్యక్తం చేశారు. పార్టీలు పేద ,బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే గుర్తిస్తున్నారని ఆవేద వ్యక్తం చేశారు, ఈ కార్యక్రకమం లో ఆర్వా బబులు 65-65,శివ రాజేష్ ,మహేందర్ తడిట పాల్గొన్నారు.
