EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కాక్రోచ్ జనతా పార్టీ కి ఊరట

ఈతరం భారతం న్యూఢిల్లీ అక్టోబర్ 21 :

కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకా అనే నాయకులకు ఊరట లభించింది. దిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతంలో అక్టోబర్ 13న నిర్వహించిన నిరసన ప్రదర్శనకు సంబంధించి నమోదైన కేసులో వారిని విడుదల చేయాలని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.వీరిద్దరి జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు ఇవాళ కోర్టు ముందుకు తీసుకొచ్చారు. విచారణలో భాగంగా పూచీకత్తులను కూడా సమర్పించారు. ఈ ప్రక్రియను పరిశీలించిన మేజిస్ట్రేట్ ఇద్దరు నేతలను విడిచిపెట్టాలని ఆదేశాలు వెలువరించారు. అప్పీలేట్ కోర్టును సంప్రదించే వెసులుబాటు ఉందని కూడా కోర్టు స్పష్టం చేసింది.నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించారనే అభియోగంపై దిల్లీ పోలీసులు ఈ ఇద్దరు నేతలను అక్టోబర్ 13న అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలను కాపాడతామని గతంలో ఇచ్చిన బాండ్ నిబంధనలను వీరు ఉల్లంఘించారని పోలీసులు ఆరోపించారు.

 

అనంతరం అక్టోబర్ 14న మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆ తర్వాత అక్టోబర్ 19న గడువు పూర్తి కావడంతో కస్టడీని మరో 2 రోజులు పొడిగించారు. ఆ గడువు బుధవారంతో ముగియడంతో కోర్టు నుంచి విడుదల ఉత్తర్వులు వచ్చాయి

Related News

Select the Topic
Scroll to Top