EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ జూలై 22

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హోర్మూజ్ జలసంధిలో వాణిజ్య, సైనిక నౌకలపై ఇరాన్ ఏ రూపంలోనైనా దాడి చేస్తే, ప్రతీసారి ఇరాన్‌లోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ట్రూత్ సోషల్ పోస్ట్‌లో “క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు లేదా ఇతర ఆయుధాలతో హోర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడి జరిగిన ప్రతీసారి ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేస్తుంది. అవసరమైతే టెహ్రాన్ సమీపంలోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలు కూడా లక్ష్యాలుగా ఉంటాయి” అని తెలిపారు.గత 11 రోజులుగా అమెరికా ఇరాన్ వ్యాప్తంగా వైమానిక దాడులు చేస్తోంది. తాజాగా అమెరికా సెంట్రల్ కమాండ్75 నిమిషాల పాటు దాడులు చేసింది. ఇరాన్సై నిక కేంద్రాలు, విమాన హ్యాంగర్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, సైనిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసింది. హోర్మూజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసే సామర్థ్యాన్ని తగ్గించడమే ఈ చర్యల ఉద్దేశమని తెలిపింది. గత మూడు నెలల్లో హోర్మూజ్ నుంచి ప్రయాణించే 30కి పైగా వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడినట్లు అమెరికా ఆరోపించింది.

Related News

Select the Topic
Scroll to Top