హైద్రాబాద్ ఏప్రిల్.13(ఈ తరం భారతం) రాజ్యాంగబద్ధంగా నియమించిన మండల కమిషన్ సిఫార్సులు పూర్తిగా అమలు చేయాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నేడు బిసి సాధికార సంఘం, యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.. మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే కేవలం మూడు సిఫార్సులు మాత్రమే అమలు చేశారు. మిగతా 37 సిఫార్సులు అమలు చేయలేదని విమర్శించారు.
ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్లు చేశారని ద్వజమెత్తారు. 76 సంవత్సరాలగా గడిచిన ఈ కులాలకు రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక మాట ఇవ్వడం లేదన్నారు. కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖలలో, 245 ప్రభుత్వ రంగ సంస్థలలో 16 లక్షలు ఖాళీలు పెండింగ్లో పెడుతున్నారని కృష్ణయ్య ద్వజమెత్తారు . ఒక రైల్వే శాఖలో 3 లక్షల 53 వేల ఉద్యోగాలు వివిధ బ్యాంకులలో ఒక లక్ష 30 వేల ఉద్యోగాలు రక్షణ రంగ సంస్థలలో నాలుగు లక్షల 30 వేల ఉద్యోగాలు, ఇలా వివిధ శాఖలలో మొత్తం 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి. వీటి భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరారు.
కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వలు ఉద్యోగులు రిటైర్ అయిన దశబ్దాల తరబడి భర్తీ చేయకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఒక MLA, MP – ఖాళీ ఏర్పడితే ఆరు నెలల లోపు ఎన్నికలు జరపాలన రాజ్యాంగం నిర్దేశిస్తుంది. కాని ఉద్యోగాల ఖాళీల విషయం లో రాజ్యాంగంలో పేర్కొనకపోవడంతో పాలకుల ఇష్టాయ్యి కు లోనై ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడం తో ప్రభుత్వ పాలనా – అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమల అమలు స్తంభించి పోతుంది. శాఖల ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులు చాలా కీలకమైనవి ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఒక అధికారి డాక్టర్ ఇంజనీర్ లేకపోతే ప్రభుత్వ కార్యకలాపాలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు.పార్లమెంట్ లో బి.సి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బి.సి లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి.ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు పెంచాలని కోరారు. బి.సి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ ను తోలగించాలని, బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బి.సి ల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని, ఎస్సీ/ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బి.సి లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి యాక్టును తీసుకరావాలని, ప్రపంచీకరణ, సరళీకృత, ఆర్ధిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ/బి.సి లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. సుప్రీమ్ కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ఎస్టీ.బి.సి లకు రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బి.సి లకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ మరియు ఫీజుల రియంబర్స్ మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ తో బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కలలో బి.సి కులాల వారి లెక్కలు సేకరించాలని కోరారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, నీల వెంకటేష్, గ్రంథాలయ మాజీ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్, బీసీ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్, బేరి రామచందర్ యాదవ్, మోదీ రాందేవ్, పచ్చిపల రామకృష్ణ, కట్ట లింగ స్వామి అనేక మంది ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.