ఈతరం భారతం ఏప్రిల్ 10, 2025:హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడినా క్రమంగా మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని బుధవారంవెల్లడించింది.బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి కొనసాగుతుండడంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.హైదరాబాదులోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. ఇక, 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరేడు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది.
