మేడ్చల్ ఏప్రిల్11.(ఈతరం భారతం) మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్మదినం సందర్బంగా టి పి సి సి లేబర్ సెల్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు కాందాడి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో *జ్యోతిరావు ఫూలే* జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా లేబర్ సెల్ ప్రధాన కార్యదర్శి కర్కల ఉపేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లేబర్ సెల్ అధ్యక్షులు కావలి గోపాల్ , జిల్లా లేబర్ సెల్ ఉపాధక్షులు మండల సందీప్ కుమార్ గౌడ్,అశోక్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తేజ, వర్మ, లక్ష్మి పతి రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా కాందాడి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతు ఏప్రిల్ 11, 1827న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన జ్యోతిరావు ఫూలే తండ్రి గోవిందరావు ఫూలే కూరగాయల వ్యాపారి, అతని తల్లి చిమ్నాబాయి చిన్నతనంలోనే మరణించారు. సామాజిక అడ్డంకులు ఉన్నప్పటికీ ఫూలే పూణేలోని హైస్కూల్లో విద్యను అభ్యసించారు, ఆయన కుల వ్యవస్థను, విద్యను ప్రోత్సహించ డానికి మహిళల హక్కులు మరియు అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. 1848లో భారతదేశంలో మొట్ట మొదటి బాలికల పాఠశాలను, అణగారిన తరగతుల కోసం ఒక పాఠశాలను మరియు శ్రామిక తరగతి వ్యక్తుల కోసం ఒక రాత్రి పాఠశాలను స్థాపించాడు. మహాత్మా ఫూలే రచనలు భారత రాజ్యాంగ ప్రధాన నిర్మాత డా ” బి.ఆర్. అంబేద్కర్ వంటి ప్రముఖ వ్యక్తులను ప్రభావితం చేశాయి అని పేర్కొన్నారు.
