రైతు రుణమాఫీలో రేషన్ కార్డు నిబంధనలు తొలగించాలి
పట్టాదార్ పాస్ పుస్తకం స్థానంలో పహనీలపై రుణాలు తీసుకుని రైతులకు వర్తింపజేయాలి
2018 డిసెంబర్ 12 గడువు లేకుండా రుణమాఫీ చేయాలి
మేడ్చల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్
మేడ్చల్ జూలై 18 (ఈతరం భారతం ); రైతు రుణమాఫీ లో రేషన్ కార్డు నిబంధనలు తొలగించాలని మేడ్చల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్ డిమాండ్ చేసారు. గురువారం మీడియా సమావేశం లో మాట్లాడుతూ అని గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయలేదని రైతు కుటుంబం గుర్తింపుకి ఆహార భద్రత కార్డు క్రైటీరియాగా తీసుకోవటం సరైంది కాదని వెంటనే నిబంధన తొలగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన రుణమాఫీ నిబంధనలు వలన అనేక మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతారని అదేవిదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయలేదని ఈ పది సంవత్సరాలలో వివాహం అయ్యి వేరే కుటుంబాలుగా ఉంటూ వ్యవసాయం చేస్తున్న యువ రైతులకు బ్యాంకుల్లో రుణాలు ఉన్న రద్దు అయ్యే పరిస్థితి లేదని వెంటనే రేషన్ కార్డు నిబంధన తొలగించాలని, పట్టాదార్ పాస్ పుస్తకం కలిగిన రైతులకు రుణమాఫీ అంటే ధరణి పాసుపుస్తకాలు కంటే ముందు చేతి రాత పహణినకల, మీ పహణి ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు వర్తించకుండా పోయే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్నా రైతు కుటుంబాల వారసులకి ధరణి పాస్ పుస్తకాలు మంజూరు కాక పెండింగ్లో ఉన్నాయని అలాంటి రైతులకు కూడా రుణమాఫీ వర్తించే అవకాశం లేదని,మరి కొంతమంది రైతులు బ్యాంకు రుణాలు 2018 డిసెంబర్ 12 గడువు లేకుండా రైతు రుణమాఫీ వర్తింపు చేయాలని కోరారు. అని ప్రభుత్వం జీవోలో పేర్కొన్న నిబంధనలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి బ్యాంకులో అప్పు ఉన్న రైతులందరూ రుణమాఫీ వర్తింపజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు