. ఈ తరంభారతం సూర్యాపేట 5.4.25 : సీసాలో శ్రీరాముల విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25 వ వార్డుకు చెందిన కూరేళ్ల పోతులూరాచారి వృత్తి రీత్యా కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తూ వివిధ రకాల కళాఖండాలను సీసాలలో బంధించడం ఆయన అలవాటు. గతంలో అనేక రకాల రాజకీయ నాయకుల,జాతీయ నాయకుల బొమ్మలను సీసాలో తన ప్రతిభతో బంధించాడు. ఈనెల 6న జరిగే శ్రీరామ నవమి సందర్భంగా బాల రాముడు, శ్రీరాములవారు,లక్ష్మణుడు,సీతాదేవి, ఆంజనేయస్వామి విగ్రహాల బొమ్మలను సీసాలో పెట్టి ప్రదర్శిస్తున్నాడు. ఒక్కొక్క బొమ్మను 20 రోజులు చొప్పున సుమారు 80రోజులు పాటు శ్రమించి ఈ బొమ్మలను తయారు చేయగా ఆయన ప్రతిభను అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.
