ఈతరంభారతం యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 8: జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి చెందిన యాదగిరిగుట్ట మండలం కాచారం కైలాసపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం ఏకాదశి సందర్భంగా శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ గురుపూజ ఎంతో ఘనంగా జరిగింది. రేణుక ఎల్లమ్మ తల్లికి సూదగాని సురేష్ గౌడ్ శ్రీవాణి,సూదగాని రాజు గౌడ్ శ్రీలత, దూడల శ్రీధర్ గౌడ్ శ్రీవాణి అమ్మవారికి చీరే సారే సమర్పించారు. డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కౌండిన్య గోత్రికులకు ఆలయం తరపున సన్మానం చేశారు. రాజాపేటకు చెందిన మార్కండేయ భక్తుడు ఎక్కల దేవి సోమరాజు పార్వతి ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది.
