కరీం నగర్ నవంబర్ 24 (ఈ తరంభారతం );ప్రసిద్ధ భారతీయ నవలా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ పేరుతో ఆవిర్బవించిన “శరత్ సాహితీ కళా స్రవంతి సంస్థ రజతోత్సవాలు 5జనవరి 2025 న కరిమ్నాగార్లో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా సబ్బని లక్ష్మీనారాయణ తెలిపారు. సంస్థ రజతోత్సవాల బ్రోచర్ ను కేంద్ర ప్రభుత్వ హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని వారి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సబ్బని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 1999 సంవత్సరం డిసెంబర్ మాసంలో “శరత్ సాహితీ కళా స్రవంతి, కరీంనగర్” ఆవిర్భవించింది. సబ్బని మొదటి కవితా సంపుటి “ మౌన సముద్రం” కూడా 1999 డిసంబర్ మాసంలోనే ఆవిష్కరించబడినాదని తెలిపారు.ఇట్టి రజతోత్సవాలను పురస్కరించుకొని ముగ్గురు రచయితలకు అవార్డులను ఇవ్వడానికి సంస్థ సంకల్పించింది.1. కలకత్తాకు చెందిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి కాబేరి చటోపాధ్యాయ ఆంగ్లంలో వ్రాసిన “ “Peeping Through my Window” అనే ఆత్మ కథకు సాహితీ వేత్త సబ్బని లక్ష్మీ నారాయణ గారి తల్లి దండ్రుల పేర ‘ సబ్బని నాగమ్మ – మల్లేశం ‘ స్మారక సాహిత్య అవార్డు 2. శ్రీమతి కాబేరి చటోపాధ్యాయ ఆంగ్లంలో వ్రాసిన “Peeping Through my Window” ఆత్మ కథను తెలుగులోకి “ ఆటుపోట్ల కావేరి “ పేర అనువాదం చేసిన ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, తెలుగు విశ్వ విద్యాలయ ఉపకులపతి గారికి ప్రముఖ రచయిత సంకెపల్లి నాగేంద్ర గారి తల్లి దండ్రుల పేర ‘ సంకెపల్లి కమలమ్మ – కాంతయ్య. ‘ స్మారక విశిష్ట అనువాద సాహిత్య అవార్డు, 3.సబ్బని లక్ష్మీ నారాయణ తెలుగులో తన తల్లిపై వ్రాసిన “అవ్వ “ స్మృతి కావ్యంను ఆంగ్లంలోకి “ Avva the Mother ‘ పేరున అనువాదం చేసిన అనంత పురమునకు చెందిన డా. పి. రమేష్ నారాయణ గారికి అనువాదంలో వారి నిర్విరామ కృషికి గాను ‘అనువాద ప్రవీణ’ అనే బిరుదును ఇస్తూ , “శరత్ సాహితీ కళా స్రవంతి, కరీంనగర్-2024” విశిష్ట అనువాద అవార్డు ,అవార్డులకు గాను 5116 /- రూపాయల నగదు, జ్ఞాపికలు, సన్మాన పత్రంములతో 5 జనవరి 2025 ఆదివారం నాడు సంస్థ రజితోత్సవాల సందర్భంగా కరీంనగర్ లో వారిని ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో సబ్బని రచనలు ‘మౌన సముద్రం’ రజతోత్సవ ప్రచురణ, సబ్బని‘మౌన సముద్రం’ అనువాద పుస్తకం” The Silent Ocean”, “నా చార్ ధామ్ యాత్ర”, “సమీక్షలు – విమర్శలు “ , “Avva The Mother” ఆంగ్ల , ఫ్రెంచ్ , జపనీస్ భాషల్లోని పుస్తకాలు , సంకెపల్లి వారి “మిడ్ మానేర్” పుస్తకాలు ఆవిష్కరణ కానున్నాయి. ఇట్టి కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు సబ్బని లక్ష్మీనారాయణ , ప్రతినిధులుగా శ్రీ అరబిందో సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ కోల అన్నారెడ్డి , ఉప్పల రామేశం గారు హాజరు అయ్యారు .