EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

ఈతరం భారతం న్యూఢిల్లీ జులై 22

నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పేపర్ లీక్‌తో సంబంధం ఉన్న అన్ని సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విపక్షాలు అడిగే ప్రశ్నలకు పార్లమెంట్‌లో సమాధానాలు ఇవ్వనున్నారు. అయితే, విపక్షాలు చీటికిమాటికి గోల్‌పోస్టు మారుస్తున్నాయని, విద్యార్థుల భవిష్యత్ గురించి తమకు పూర్తి బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు.గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్లు లీక్ అయ్యాయని, యూపీఏ హయాంలో పలు రాష్ట్రాల్లో పేపర్లు లీక్ జరిగిందన్నారు. విద్యార్ధులు క్రమంగా వాడుకోవడం దురదృష్టకరమని. కొన్ని అంశాలనే టార్గెట్‌గా చేసుకుని రాహుల్‌గాంధీ రాజకీయాలు ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పేపర్లు లీక్, తెలంగాణలో ఇంటర్ పేపర్, కేరళ, తమిళనాడులో పేపర్లు లీక్ అయ్యాయని చెప్పారు. బెంగాల్, కర్ణాటకలోనూ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని పేర్కొన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన మీడియాకు వివరాలు తెలియజేశారు.

Related News

Select the Topic
Scroll to Top