హైదరాబాద్ ఫిబ్రవరి 20 (ఈతరం భారతం);రోజు రోజు కు తెలంగాణ రాస్ట్రం లో బిసి నినాదం బలపడుతుంది.ఇటీవల తీ న్మార్ మల్లన్న నేతృత్వం లో వరంగల్ లో జరిగిన బిసి చేతన్య బహిరంగ సభ విజయవంతం కావడం తో తెలంగాణ రాస్ట్రం వ్యాప్తంగా బిసిలలో చైతన్యం ఉట్టి పడుతుంది.ఈ నేపద్యం లో తీన్మార్ మల్లన్న ‘క్యూ’ ఆఫీసు కు బిసిలు ఉస్సహమ్ తో కదలి వస్తున్నారు.తాజాగా మంచిర్యాల జిల్లా నుంచి వంగాల దయానంద్ గంగపుత్ర, గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యదనబోయిన రాజన్న యాదవ్, పెద్దపల్లి రాజేందర్, వినయ్, తిరుపతి ,జయశంకర్, యాకూబ్ ,భూమయ్య నాయక్ తదితరులు తీన్మార్ మల్లన్నను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి తమ మద్దరతును తెలియ జేశారు.ఈ కార్యక్రమం లో బీసీ నాయకులు వైద్యం భయ్యా వెంకటేశ్వర్ యాదవ్ బీసీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తీన్మార మల్లన్న మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 42% అమలు చేసి చట్టబద్ధత కల్పించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీలను తక్కువ జనాభా చూపించే ప్రయత్నం మానుకోండి ఇప్పుడు చేసే రీసర్వే లోనైనా పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీలు దాదాపు 93% జనాభా ఉంటారు తెలంగాణలో… ఇంత జనాభా ఉండి మనం వాళ్ళను దేహి అని అడుక్కునే దుస్థితిలో కొనసాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవించాం.. ఇప్పటికైనా మేలుకుందామనీ పిలుపు నిచ్చారు.
