Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

లా కమిషన్ చైర్‌పర్సన్‌గా మహేశ్వరి?

న్యూఢిల్లీ ఏప్రిల్, 14 (ఈతరం భారతం); : సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి దినేశ్ మహేశ్వరి లా కమిషన్‌కు సారథ్యం వహించవచ్చునని తెలుస్తుంది . 23వ లా కమిషన్ చైర్‌పర్సన్‌గా మహేశ్వరి నియామకంపై లాంఛనంగా ఒక నోటిఫికేషన్ ఈ వారంలో జారీ కావచ్చునని ఆ వర్గాలు తెలిపాయి. 23వ లా కమిషన్‌ను మూడు సంవత్సరాల వ్యవధి కోసం నిరుడు సెప్టెంబర్ 2న ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టు,హైకోర్టు న్యాయమూర్తులను కమిషన్ చైర్‌పర్సన్‌గా, కమిషన్ సభ్యులుగా నియమించేందుకు ఒక నిబంధన ఉన్నప్పటికీ సాధారణంగా సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తును, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులను చైర్‌పర్సన్‌గా నియమిస్తుంటారు.కమిషన్ పరిశీలనాంశాల ప్రకారం, ఉమ్మడి శిక్షా స్మృతి (యుసిసి)ని దేశంలో ప్రవేశపెట్టవచ్చా అనేది పరిశీలించే బాధ్యతను కూడా కమిషన్‌కు అప్పగించారు. జస్టిస్ (రిటైర్డ్ మహేశ్వరి 2019 జనవరిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి 2023 మే 14న పదవీ విరమణ చేశారు. ఆయన 2004 రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను 2014 జూలైలో అలహాబాద్ హైకోర్టుకు బదలీ చేశారు. మహేశ్వరి 2016 ఫిబ్రవరిలో మేఘాలయ హైకోర్టుకు 2018 ఫిబ్రవరిలో కర్నాటక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.

Related News

Select the Topic
Scroll to Top