Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

మీ వాట్సాప్‌ ఎప్పుడైనా హ్యాక్‌ కావొచ్చు..! యూజర్లకు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్‌..!

న్యూ డిల్లీ ఏప్రిల్ 14 (ఈతరం భారతం); మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లు ఉన్నారు. భారత్‌లోనూ కోట్లాది మంది వాట్సాప్‌ని వాడుతున్నారు. భారత వాట్సాప్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్‌ కారణంగా మొబైల్‌ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. వాట్సాప్‌లో బగ్‌ని గుర్తించినట్లు పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఈ హెచ్చరికలు జారీ చేసింది.CERT-In ప్రకారం.. వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు సైతం డేంజర్‌లో ఉన్నారంటూ హెచ్చరికలు చేసింది. డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లో వాట్సాప్‌ను నడుపుతున్న యూజర్లు.. డెస్క్‌టాప్ వెర్షన్ 2.2450.6 కంటే పాత వెర్షన్‌ వాడుతున్నట్లయితే ఆయా యూజర్ల సిస్టమ్స్‌ హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉంది పేర్కొంది. బగ్ కారణంగా, హ్యాకర్లు మీ డివైజ్‌ను వాట్సాప్‌ యాప్‌ సహాయంతో యాక్సెస్‌ చేసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. వాట్సాప్ డెస్క్‌టాప్ అప్లికేషన్‌ సెక్యూరిటీ పరంగా బలహీనంగా ఉందని సెర్ట్‌ పేర్కొంది. ఇది ఫైల్‌ ఓపెనింగ్‌ ప్రాసెస్‌కు సంబంధించిందని.. ఎంఐఎంఈ రకం, ఫైల్‌ ఎక్స్‌టెన్షన్‌ మధ్య సరిపోలకపోవడం కారణంగా.. వాట్సాప్‌ కొన్ని అటాచ్‌మెంట్స్‌ని సరిగ్గా గుర్తించలేకపోతుందని.. ఈ టెక్నికల్‌ వీక్‌నెస్‌ని సద్వినియోగం చేసుకొని హ్యాకర్స్‌ మీ కంప్యూటర్లలోకి వైరస్‌ను చొప్పించే ప్రమాదం ఉందని పేర్కొంది.హ్యాకర్స్‌ సిస్టమ్స్‌కి పంపే ప్రమాదకరమైన ఫైల్స్‌ సాధారణంగానే కనిపిస్తాయని.. ఆ ఫైల్స్‌ని ఓపెన్‌ చేస్తే వెంటనే వ్యక్తిగత డేటా తస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. అకౌంట్‌ హ్యాకింగ్‌ బారినపడే చాన్స్‌ ఉంటుందని చెప్పింది. వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ని ఉపయోగించే వారంతా అప్లికేషన్‌ని అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఏవైనా గుర్తు తెలియని లింక్స్‌ని క్లిక్‌ చేయడం మానుకోవాలని, తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలకు రిప్లే ఇవ్వొద్దని.. ప్రతి అప్‌డేట్‌తో వెంటనే వాట్సాప్‌ అప్లికేషన్‌ కొత్త వెర్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సెర్ట్‌ సూచించింది

.

 

Related News

Select the Topic
Scroll to Top