న్యూ డిల్లి(వాటర్లూ) ఏప్రిల్ 16 (ఈ తరం భారతం ); : అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే రోజుకో అరటి పండు తినాలని వాటర్లూ యూనివర్సిటీ కొత్త అధ్యయనం సూచిస్తోంది. రోజూ తినే ఆహారంలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉండేలా చూసుకొంటే రక్తపోటు తగ్గుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన మెలిస్సా స్టాట్ అన్నారు.పొటాషియం ఎక్కువగా ఉండే అరటి, బ్రకోలి లాంటి ఆహారాన్ని తినడం వల్ల రక్తపోటుపై సానుకూల ప్రభా వం పడుతుందని వారు చెప్పారు.
