హైదరాబాద్ ఏప్రిల్ 18 (ఈతరంభారతం );గ్రూప్ 1 ఫలితాలలో అనేక అవక తవకలు జరిగాయి. మూల్యాంకనంలో తప్పులు చేశారు. పరీక్షా కేంద్రంలో కేటాయింపులో అవకతవకలు జరిగాయి. దీనిపై సిబిఐ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నేడు గ్రూప్ 1 అభ్యర్థులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా జరిపారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, జనార్ధన్ అధ్వర్యంలో జరిగిన ధర్నాకు జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మద్దతు తెలిపారు, ఈ సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ మెరిట్ అభ్యర్ధులకు పాస్ కాలేదని ఆందోళన చెందుతున్నారని అన్నారు. అవకతవకలకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని. గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ, OMR షీట్ల లోపాలు, బయోమెట్రిక్ హాజరు లేకపోవడం వంటి అంశాలపై బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షలు తిరిగి నిర్వహించాలి కానీ పారదర్శకంగా విధివిధానాలను పునఃసమీక్షించి, పూర్తి బయోమెట్రిక్, సీసీ కెమెరా పర్యవేక్షణతో పారదర్శక పరీక్షల నిర్వహణ జరగాలన్నారు. బాధిత అభ్యర్థులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఏకంగా రెండు పరీక్షలు రద్దు కావడం వల్ల వేల మంది అభ్యర్ధులు మానసికంగా, ఆర్థికంగా నష్టపోయారు. వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు న్యాయ విదారణకు హైకోర్టు లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్ వేయాలి. పూర్తి పారదర్శకతకై, ఒక స్వతంత్ర విచారణ కమిటీ ద్వారా పరిశీలన జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ ధర్నా కార్యక్రమంలో నీల వెంకటేష్, గుజ్జ సత్యం, జనార్ధన్, పగిళ్ళ సతీశ్, పల్లగొర్ల మోదీరాందేవ్, పృద్వీ గౌడ్, సుధాకర్, నరేందర్, రవి యాదవ్. లింగం ముదిరాజ తదితరులు పాల్గొన్నారు