ఈ తరం భారతం న్యూఢిల్లీ ఏప్రిల్ 19 : చార్ధామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్నాథ్ ఆలయాన్ని మే 2న భక్తుల కోసం తెరుచుకోనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. బద్రీనాథ్ ఆలయం మే 4న ప్రారంభంకానుంది. అలాగే, మద్మహేశ్వర ఆలయం మే 21న, తుంగనాథ్ ఆలయం మే 2న తెరుస్తామని కమిటీ వివరించింది. హిమపాతం కారణంగా ఈ దేవస్థానాలు కేవలం వేసవికాలంలోనే కొద్ది రోజులు తెరిచి ఉంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నారు.
