చౌటుప్పల్ ఏప్రిల్ 19 (ఈతరం భారతం) చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ప్రిన్సిపల్ కే. సరోజనమ్మ అధ్యక్షతన ఒత్తిడి, వైఫల్యాలను, జీవిత సవాళ్లను ఎదుర్కొనేల విద్యార్థినిలను సిద్ధపరచడం కొరకు” చెలిమి”కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ ముఖ్యఅతిథిగా ప్రముఖ సాహితీవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు బడుగు శ్రీరాములు పాల్గొని ప్రసంగించారు. చెలిమి అంటే స్నేహమని, స్నేహమాధుర్యాన్ని తోటి విద్యార్థులకు పంచడం ద్వారా మానసిక ప్రశాంతతను కలిగించవచ్చునని అన్నారు. విద్యార్థినిలు అవరోధాలు కలిగినప్పుడు ధైర్యంతో ఎదుర్కోవాలని ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా జీవించాలని ప్రతిరోజును, ప్రతిక్షణం ను గొప్పగా ఉపయోగపడే విధంగా చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. మనసులో విరుద్ధ ఆలోచనలు చేరకుండా ప్రతినిత్యం యోగా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ విశిష్ట అతిథిగా విచ్చేసిన పాలకుర్లా శివయ్య గౌడ్ స్వారక ఫౌండేషన్ చైర్మన్ పాలకొల్లు మురళి గౌడ్ మాట్లాడుతూ గురువుల ఎడల పూజ్య భావము, మరియు సమయపాలన క్రమశిక్షణను అలవర్చుకొని ఈ దశలోని ఒక లక్ష్యమును ఏర్పాటు చేసుకొని లక్ష సాధనకై కృషి చేయాలని అన్నారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని అన్నారు. ప్రిన్సిపాల్ కే సరోజనమ్మ మాట్లాడుతూ విద్యార్థులు నిరాశ నిస్పృహలకు గురికాకుండా వినయ విజ్ఞానాలను వినమ్రతను పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థినిలు వారి స్పందనను వినిపించారు. ఈ కార్యక్రమంలో ఏం స్వాతి, బి స్వాతి, ఆర్ నాగలక్ష్మి ఉషారాణి పద్మజ మొదలగు టీచర్లు పాల్గొన్నారు
