హైదరాబాద్ ఏప్రిల్ 19 (ఈతరం భారతం)భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇటీవల లోక్ సభ,రాజ్యసభలో ఆమోదింప జేసిన WAQF అమెండ్ మెంట్ చట్టంను వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతూ రామంతాపూర్ శివాజీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పల్ మాజీ శాసనసభ్యుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,బిజెపి సీనియర్ నాయకులు, మోర్చాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ,తదితర కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు
