న్యూఢిల్లీ ఏప్రిల్ 19 (ఈతరం భారతం );: ఇంధన శక్తి, వాణిజ్యం, రక్షణ సహా పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం విస్తరణపై దృష్టితో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే మంగళవారం (22) నుంచి రెండు రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌తోచర్చల అనంతరం ఉభయ పక్షాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. రెండు దేశాల మధ్య ఇప్పటికే బలంగా ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం వృద్ధికి ఈ పర్యటన అవకాశం కల్పిస్తుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రి మీడియాసమావేశంలో తెలియజేశారు. భారత సౌదీ అరేబియా ఇంధనశక్తి సహకారానికి వ్యూహాత్మక కోణంఇచ్చేందుకు కృషి జరుగుతుందని మిశ్రి చెప్పారు.