Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

గర్భాశయ కాన్సర్ నిర్మూలన దిశగా హెచ్పీవీ టీకా ఒక కీలకమైన అడుగు: డా. చినబాబు సుంకవల్లి

హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఈతరంభారతం) క్యాన్సర్ పై విజయం సాధించేందుకు విద్య, ప్రాథమిక నిర్ధారణ, చికిత్స, పునరావాసం మరియు పరిశోధన ద్వారా కృషి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, బెంగళూరు ఆధారిత సంస్థ మ్యాక్సిమస్ ఇండియాతో కలిసి, క్యాన్సర్ నిర్మూలన లక్ష్యంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ ప్రయత్నంలో భాగంగా కర్నాటక రాష్ట్రం,దేవనగిరి లోని మయూర్ గ్లోబల్ స్కూల్ లో ఉచిత హెచ్పీవీ టీకాలు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించింది .ఈ శిబిరంలో 350 మంది బాలికలకు హెచ్పీవీ టీకాలువేశారు, అలాగే 200 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. హెచ్పీవీ టీకా ద్వారా గర్భాశయ కాన్సర్ సహా హెచ్పీవీ సంబంధిత క్యాన్సర్లను గణనీయంగా తగ్గించవచ్చు. టీకా ద్వారా నిర్దిష్ట హెచ్పీవీ వైరస్ రకాల నుంచి రక్షణ లభించి, భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో క్యాన్సర్ కేసులు నివారించబడతాయి.ఈ కార్యక్రమం సామూహిక చొరవ ద్వారా క్యాన్సర్‌ను ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో ప్రతిపాదించింది. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు మ్యాక్సిమస్ ఇండియా మధ్య జరిగిన ఈ భాగస్వామ్యం, ప్రజారోగ్యానికి చేసిన నిబద్ధతకు ఒక మైలురాయి గా నిలిచింది. ఈ ప్రయత్నం కేవలం అవగాహన పెంచడం మాత్రమే కాకుండా, సమాజాన్ని ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములను కూడా చేసింది.హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రెస్ నోట్లో, డా. చినబాబు సుంకవల్లి, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపకుడు, సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోదా ఆసుపత్రుల క్లినికల్ డైరెక్టర్, ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు: “*ప్రతి అమ్మాయి బాల్యంలోనే హెచ్పీవీ టీకా తీసుకోవాల్సిందే. మనమందరం కలిసి ఈ రక్షణ కవచాన్ని అందిద్దాం,” అని గర్భాశయ క్యాన్సర్ నివారణలో టీకాల పాత్రను ప్రాధాన్యంతో వివరించారు.కర్నటక ప్రభుత్వ అధికారి పి.ఎన్. లోకేశ్ ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రజల సహకారం ఎంత కీలకమో ప్రస్తావించారు.మ్యాక్సిమస్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రీ హెడ్ ప్రవీణ భీమవరపు ముందస్తు జాగ్రత్తల ప్రాధాన్యాన్ని వివరించారు. ఆరంభంలోనే జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్‌ను గణనీయంగా తగ్గించవచ్చు అని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేస్తున్న గర్భాశయ కాన్సర్‌ను నివారించడంలో హెచ్పీవీ టీకా కీలకమని ఆమె వివరించారు.ఈ కార్యక్రమం క్యాన్సర్ లేని భారత్ దిశగా ఒక చిన్న మరియు మొదటి అడుగు కానీ ఎంతో ప్రాధాన్యమైన అడుగు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు మ్యాక్సిమస్ ఇండియా భాగస్వామ్యం భవిష్యత్ ఆరోగ్య కార్యక్రమాలకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది అని వక్తలు తెలిపారు

Related News

Select the Topic
Scroll to Top