హైదరాబాద్ మే 5 (ఈతరం భారతం );తెలంగాణ క్రీడా అధికార సంస్థ, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య మరియు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో “టాలెంట్ ఐడీ వర్క్‌షాప్ 2025” నేడు గచ్చిబౌలి జి.ఎం.సి.బి స్టేడియంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నుండి ఫుట్‌బాల్ కోచ్‌లు, రెఫరీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు మరియు ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.ఫిఫా టాలెంట్ ఐడెంటిఫికేషన్ నిపుణుడు శ్రీ రిచర్డ్ అలెన్ మాట్లాడుతూ, ఫిఫా రూపొందించిన టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను గుర్తించి అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. టిడిఎస్‌ను ప్రపంచ స్థాయి ప్రతిభా అభివృద్ధి, ఫుట్‌బాల్ సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన ప్రణాళికగా ఆయన పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలోనే పిల్లల్లోని మౌలిక క్రీడా ప్రతిభను గుర్తించి నిపుణులకు పరిచయం చేయడం ద్వారా భవిష్యత్తులో వారికి పెద్ద ఉపయోగమవుతుందని సూచించారు.తెలంగాణ క్రీడా సంస్థ వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఎ. సోని బాలాదేవి, IFS గారు మాట్లాడుతూ, ఈ ట్రయల్స్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన పలువురు యువ ఆటగాళ్లను గుర్తించామని, వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రతిభా బృందాన్ని ఏర్పాటుచేశామని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభను గుర్తించే టాలెంట్ స్కౌట్స్‌ను కూడా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా ఫిఫా మరియు AIFF సహకారంతో రాష్ట్రంలో ఫుట్‌బాల్‌ను దీర్ఘకాలిక ప్రణాళికగా అభివృద్ధి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రక్ష పన్వార్ – స్కౌటింగ్ మేనేజర్ గెడ్ రోడీ – హై పర్ఫార్మెన్స్ నిపుణుడు, ప్రణవ్ ప్రవీణ్ – ప్రాంతీయ అధిపతి, మధు కన్నం – నిర్వాహకుడు, జి.ఎం.సి.బి స్టేడియం, గచ్చిబౌలి తదితరులు పాల్గొన్నారు.
