అమరావతి ఫిబ్రవరి 22 (ఈతరం భారతం );: ఆంధ్రప్రదేశ్ టమోటాను తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రకు పంపిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ టమోటా రైతులను ఆదుకునేందుకు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో ఎపి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల దగ్గర కిలో రూ. 8కి కొని రైతు బజార్లకు పంపాలని అన్నారు. ఇవాళ వెయ్యి క్వింటాళ్ల టమోటా సేకరించి నగరాలకు పంపామని తెలియజేశారు. ఎఐఎస్, నాఫెడ్, ఎన్ సిసిఎఫ్ ద్వారా రైతులను ఆదుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు. పొరుగు రాష్ట్రాలకు పంపడం ద్వారా రూ. 15 వరకు ధర వస్తుందని చెప్పారు. టమోటాలను ప్రాసెసింగ్ యూనిట్లకు పంపుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.