అమరావతి డిసెంబర్ 4 (ఈ తరం భారతం); : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యపై నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ వైసీపీ పోరుబాటకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన తేదీలను ఖరారు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 11న ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయాలని నాయకులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల బీమా పునరుద్దరణ, రూ. 20 వేల పెట్టుబడి సాయం, డిసెంబర్ 27న పెంచిన కరెంటు ఛార్జీలపై , జనవరి 3న ఫీజు రియింబర్స్‌మెంట్ అంశంపై ఆందోళనలు చేపట్టాలని సూచించారు