ఈతరంభారతంతిరుమల: ఏప్రిల్ 27 : తిరుమలలో మే 1 నుంచి సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. జులై 15 వరకు సిఫార్సు లేఖలు అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులు, తితిదే బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని వెల్లడించింది. ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని చెప్పింది. వేసవి సెలవుల దృష్ట్యా తితిదే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పు
మే 1 నుంచి పరిశీలనాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు ఉదయం 6 గంటల నుంచి బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం మే 1 నుంచి జులై 15 వరకు అమలువుతందని పేర్కొంది.