ఈ తరం భారతం అయోధ్య ఏప్రిల్ 28:అయోధ్యలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. హనుమాన్ ఢీ ఆలయ ప్రధాన అర్చకుడు తొలిసారి ఆలయ ప్రాంగణాన్ని వీడి రామాలయానికి వెళ్లనున్నారు. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా బాలరాముడిని దర్శించుకోనున్నారు. శతాబ్దాలుగా వస్తున్న ఆచారాల ప్రకారం.. హనుమాన్ ఢీ అధిపతి జీవితాంతం ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లకూడదు. 70ఏళ్ల మహంత్ ప్రేమ్ దాస్క కోరికమేరకు తొలిసారి ఆ నియమాన్ని పక్కన పెట్టనున్నారు.