Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

ఉజ్జయిని లోని మహాకాళేశ్వర ఆలయ సముదాయంలో భారీ అగ్నిప్రమాదం  

ఉజ్జయిని మే 5 (ఈతరం భారతం):మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహాకాళేశ్వర ఆలయ సముదాయంలోని శంభ్‌ ద్వార్‌ సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తేల్చారు. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Related News

Select the Topic
Scroll to Top