గాంధీనగర్ ఫిబ్రవరి 21 (ఈతరంభారతం );: గుజరాత్ జిల్లా కచ్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేరా ముంద్రారోడ్డులో బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
.