న్యూ డిల్లీ డిసెంబర్ 4 (ఈ తరం భారతం );గూండా, సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కఠినంగా ఉందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2023 మేలో గూండా చట్టం కింద పెండింగ్‌లో ఉన్న విచారణలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. దాంతో పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విచారణకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ పిటిషన్ గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వ స్పందన కోరింది. దీంతో గ్యాంగ్‌స్టర్ చట్టం కింద పిటిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాదులు గౌరవ్ అగర్వాల్, తన్వి దూబే వాదనలు వినిపించారు. యూపీ గ్యాంగ్‌స్టర్ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఎఫ్‌ఐఆర్ నిరాధారమని పేర్కొన్నారు.ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పిటిషనర్ ఆరోపించారు. పిటిషనర్‌పై గ్యాంగ్‌స్టర్ల చట్టాన్ని వర్తింపజేయడం పక్షపాతంతో కూడుకున్నదని, ఇది పోలీసు, న్యాయ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడమేనని పిటిషనర్ పేర్కొన్నారు. బుధవారం పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తొలుత 1986 చట్టంలోని సెక్షన్ల కింద అక్రమ మైనింగ్ కేసు నమోదు చేశారని.. ఒకే అభియోగంపై రెండుసార్లు కేసు నమోదైందన్నారు. గూండా చట్టాన్ని విమర్శించిన ధర్మాసనం దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ చట్టంలోని కొన్ని నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌ను కూడా కోర్టు విచారిస్తుందని ధర్మాసనం తెలిపింది. అంతకుముందు హైకోర్టులో పిటిషనర్ తరఫు న్యాయవాది గ్యాంగ్‌స్టర్ చట్టం కింద నమోదైన కేసులో తనను ఇరికించారని వాదనలు వినిపించారు. పిటిషనర్ పేరు లేని మరో కేసు ఆధారంగానే గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.