న్యూ డిల్లీ మే 14 (ఈ తరం భారతం):ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వేలాది మందిని తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో మూడు శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ నిర్ణయంతో దాదాపు 6 వేల మందిపై లేఆఫ్స్ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. 2023లో 10 వేలమందికి ఉద్వాసన పలికిన అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు కానుంది.గతేడాది జూన్ నాటికి ఆ సంస్థలో 2.28 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయంతో మధ్యస్థ స్థాయి మేనేజ్‌మెంట్ ఉద్యోగులపై అధిక ప్రభావం పడనుందని అంచనా. ఈ ఏడాది ప్రారంభంలో కూడా పనితీరు ఆధారంగా పలువురు ఉద్యోగులను సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. తాజా లేఆఫ్‌లకు ఉద్యోగుల పనితీరుకు సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది.