ప్రయాగ్‌రాజ్ జనవరి 28 (ఈతరం భారతం);: త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. ఇప్పటికే 15 కోట్ల మంది మహాకుంభ్‌లో అమృత స్నానాలు చేశారు. అయితే రేపు మౌనీ అమావాస్య సందర్భంగా .. కుంభమేళాకు ఒక్క రోజే సుమారు పది కోట్ల మందికిపైగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీని కోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. గడిచిన 17 రోజుల్లో ప్రతి రోజూ సుమారు కోటి మంది వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. బుధవారం మౌనీ అమావాస్య కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను అమర్చారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. సంగంకు వెళ్లే స్థానికులు ఫోర్ వీలర్లను కాకుండా, టూ వీలర్లను వాడాలని ప్రభుత్వం సూచించింది.
మౌనీ అమావాస్య ప్రత్యేకతేంటి..
మౌనీ అమావాస్య రోజున నదీ స్నానం విశేషమైంది. మహాకుంభమేళాలో అమావాస్య రోజున నిర్వహించే స్నానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6.45 నిమిషాలకు .. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించే భక్తులపై పూలవర్షం కురిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. షాహి స్నానం నిర్వహించే తేదీల్లో.. నాగ సాధువులు, అకాడాలు భారీ ర్యాలీగా నదీ తీరానికి చేరుకుంటారు. అమృత స్నాన దినాల్లో అదే ఆకర్షణీయమైంది. అయితే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి.. ఒకే రేఖలోకి రావడం వల్ల.. పవిత్ర నదుల ఆధ్యాత్మిక శక్తి మరింత దిగ్విణీకృతం అవుతుందని భావిస్తారు.హిందూ క్యాలెండర్‌లోని మాఘ కృష్ణ అమావాస్య రోజున.. మౌనీ అమావాస్య వస్తుంది. అమృత స్నాన దినాల్లో.. మౌనీ అమావాస్య స్నానమే ప్రత్యేకమైందిగా భావిస్తారు. ఈ రోజున పవిత్ర నదీ జలం అమృతంలా మారుతుందని చెబుతుంటారు. మౌనీ అమావాస్యను సాధువులు స్నానం చేసే రోజు అని కూడా పేర్కొంటారు. సాంప్రదాయకర రీతిలో మౌనంగా మౌనీ అమావాస్య రోజున స్నానాన్ని ఆచరిస్తారు. జనవరి 28, 29, 30 తేదీల్లో ప్రయాగ్‌రాజ్‌లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.