న్యూఢిల్లీ ఏప్రిల్ 25 (ఈతరం భారతం);: రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వినాయక్ దామోదర్ సావార్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. బ్రిటీషర్ల పెన్షన్ తీసుకున్నట్లు సావార్కర్‌పై రాహుల్ ఆరోపించారు. ఈ కేసులో జస్టిస్ దీపాంకర్ దత్తా, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు సావార్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. ఒకవేళ రాహుల్ మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అప్పుడు ఆయనపై సుమోటో కేసును నమోద చేసి చర్యలు తీసుకోనున్నట్లు కోర్టు చెప్పింది. అయితే గతంలో మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసులో సమన్లు జారీ చేసింది. ఆ సమన్లపై సుప్రీం స్టే ఇచ్చింది.సమన్లపై స్టే ఇస్తూ కోర్టు కొన్ని కీలక అభిప్రాయాలు వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ నానమ్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.. సావార్కర్‌ను పొగుడుతూ లేఖ రాసినట్లు కోర్టు గుర్తు చేసింది. యువర్ ఫేయిత్‌ఫుల్ సర్వెంట్ అన్న పదాన్ని మహాత్మా గాంధీ వాడారని, ఫ్రీడం ఫైటర్‌ను నానమ్మ మెచ్చుకున్న సంగతి ఆయనకు తెలుసా అని కోర్టు ప్రశ్న వేసింది. ఫ్రీడం ఫైటర్ల గురించి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయరాదు అని సుప్రీం వార్నింగ్ ఇచ్చింది. చరిత్ర తెలియకుండా, ఖగోళ పరిస్థితులు తెలియకుండా.. ఫ్రీడం ఫైటర్లపై వ్యాఖ్యలు చేయడం సరికాదు అని కోర్టు పేర్కొన్నది.