హనుమకొండ అక్టోబర్ 27 (ఈతరం భారతం);ప్రతి నెల 2వ, 4వ ఆదివారాల్లో హనుమకొండ శ్రీ రామ కృష్ణ సేవా మందిర్ యందు ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు, కటంగూరి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం మొదట మూర్తిత్రయంనకు హారతి, జ్యోతి ప్రజ్వలన తో ఉచిత వైద్య శిబిరం ను ఆయన ప్రారంబించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ సేవా సమితి, కేఎల్ఎన్ రెడ్డి కాలనీ, హనుమకొండ ప్రాంగణంలో ఓరుగల్లు హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్, వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతినెలా 2వ, 4వ ఆదివారాల్లో ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించ బడింది. శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు, కటంగూరి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సేవా సమితి ద్వారా గర్భస్థ శిశువు నుండి వార్ధక్య దశ వరకు ఆర్యజనని సేవలు, బాల సంస్కార్, యోగా, శిక్షణ తరగతులు , ఉచిత వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. మొదట మూర్తిత్రయంనకు హారతి, జ్యోతి ప్రజ్వలన తో ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. దాదాపు 20 మందికి ఉచిత వైద్య పరీక్ష చేసి వారికి అవసరమైన మందులు ఇవ్వబడినవి. తిరిగి వచ్చే నెల 2వ ఆదివారం శిబిరం కొనసాగుతుందని డాక్టర్లబృందం తెలియజేసింది.కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస స్వామి, కెవి రావు, కే.సూర్య, లక్ష్మి రావు, పార్వతి, వీణ హోమియో పతిక్ డాక్టర్ల బృందం నుండి గౌరవాధ్యక్షులు డా॥ సుధాకర్ రావు,అధ్యక్షులు భీంగాని లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు కమల్ కిషోర్, ప్రధాన కార్యదర్శి రాంబాబు, కోశాధికారి బాసాని శ్రీకాంత్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీధర్, ఎక్స్క్యూటివ్ మెంబర్ సాయికృష్ణ, గీతా లక్ష్మి కీర్తి, పాల్గొన్నారు.