హన్మకొండ మే 6 (ఈతరం భారతం న్యూ స్); కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం! రాహుల్ని ప్రధానిని చేద్దాం! అని అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ,తెలంగణ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ బి.సి. సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మేరుగు బాబు యాదవ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతము దేశ ఔన్నత్యాన్ని నిలిపేందుకై జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మన తెలంగాణ రాష్ట్రం పక్షాన కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులైన వరంగల్ మరియు మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గాల నుండి కాంగ్రెస్ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న డా|| కడియం కావ్య మరియు పోరిక బలరాం నాయక్ గార్లను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు చేతిగుర్తుపై ఓటువేసి మన బి.సి. వర్గాల ప్రజలందరూ, ముఖ్యంగా యాదవులందరూ ఐక్యతను చాటుకొనాలని అఖిల భారతీయ యాదవ మహాసభ పక్షాన ముకుళిత హస్తాలతో సవినయంగా విజ్ఞప్తి చేసారు.తెలంగాణ మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ, దశాబ్దాల ఆకాంక్ష అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని గొప్ప మనస్సుతో అవగాహన చేసుకొని ఎన్ని ఒడిదొడుకులు, అడ్డంకులు, అవాంతరాలు, కష్టనష్టాలు ఎదురైనప్పటికీ సాహసోపేత నిర్ణయం తీసుకొని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. దానికి కృతజ్ఞతగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచినందుకు తెలంగాణ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు
.