జగిత్యాల నవంబర్ 18 (ఈతరం ఇండియా న్యూస్);బీసీల్లారా! ఆలోచించి ఓటు వెయ్యండి అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేసారు.రేపు నీ కొడుకు బిడ్డ భవిష్యత్తును నాశనం చేసే రెడ్డి, వెలమ, కమ్మ నాయకులకు ఓటు వేయమని ప్రచారం చేసే బీసీల్లారా! ప్రస్తుతం నీకు రావాల్సిన సర్పంచ్, కార్పొరేటర్, వార్డ్ మెంబర్, ఎమ్మెల్యే మంత్రి పదవులను, ఉద్యోగాలను అనుభవిస్తున్న రెడ్డి, వెలమ కమ్మ కు ఓటు వేయమని తిరుగుచున్న నీవు గ్రహించాల్సిన నిజం, ఇప్పుడు వారు గెలిస్తే రేపు నీ బిడ్డలకు రావాల్సిన పదవులు, ఉద్యోగాలను, నువ్వు ఓటు వేసి గెలిపించండి అని తిరుగుతూ నువ్వు కూడా ఓటు వేయడానికి సిద్ధమైన నాయకుడి కుటుంబ సభ్యులు, కులపు వారు అనుభవిస్తారన్నారు.బీసీకి మాత్రమే ఓటు వేయి, లేదంటే నోటాకు ఓటు వేయి, ఎమ్మెల్యే సీట్లలో బీసీలకు సగం సీట్లు ఇవ్వకుండా మోసం చేసింది వీరే కదా, SC, ST లకు రిజర్వేషన్ ఉండటం వలన వారి వాటా వారికి వస్తున్నది, ఓసి లకు 10% రిజర్వేషన్ ఉన్నది. బీసీలు 64% ఉంటే కేవలం 23% మాత్రమే రిజర్వేషన్ ఉన్నది. మనకు దక్కవలసిన 37% వాటా రెడ్డి, వెలమ, కమ్మలు అనుభవిస్తున్నారు. కావున బీసీ లకు మాత్రమే ఓటు వేస్తే చట్టసభల ద్వారా బీసీ లకు న్యాయం జరుగుతుంది, కేసీఆర్ కు ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబసభ్యులకు పదవులు, తన కులపోల్లకు పదవులు, ఉద్యోగాలు రెడ్లకు, పదవులు, ఉద్యోగాలు ప్రమోషన్ లు ఇస్తుండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఐతే కూడా రెడ్లు, వెలమలు, కమ్మలే బాగు పడుతారు, కావున బీసీలు పార్టీలకు అతీతంగా బీసీ లకు మాత్రమే ఓటు వేయండని కోరారు. రెడ్లను, వెలమలను, కమ్మలను చూసి భయపడతారు కాని ఓటు చాటుగా కదా వేసేది కావున బీసీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తేనే బీసీలకు భవిష్యత్తును ఉంటుంది, గెలిచే వారికే పార్టీలు సీటు ఇస్తాయి కావున బీసీలు గెలవాలి. బీసీ ముఖ్యమంత్రి అయితే మన తెలంగాణ రాష్ట్రానికి కావల్సినన్ని నిధులు కేంద్రాన్ని అడిగి తెచ్చుకోవచ్చు. అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చాలా ముందంజలో ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో బీసీ లకు ఓటు వేసి గెలిపించుకొనే గొప్ప అవకాశం మనకు ఇప్పుడు లభించింది కావున ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ అవకాశం మన రాజకీయాలలో మార్పు అనేది జరిగితే ఎలా ఉంటుందో …..ఇదే మనకు మంచి తరుణం. కాబట్టి బీసీల్లారా ఒక్కసారి గట్టిగా ఆలోచించి ఈ ఎన్నికలలో మన బీసీ లకు ఓటు వేసి గెలిపించాలని ముసిపట్ల లక్ష్మీనారాయణ కోరారు .
