EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాష్ట్ర వనరులను దోచుకుని కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడింది       మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ మే 25 (ఈతరం భారతం న్యూ స్);తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసి, రాష్ట్ర వనరులను దోచుకుని కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణను నాశనం చేసింది మీరు కాదా? అని కేటీఆర్, హరీశ్రావులను ఉద్దేశించి ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో కవిత రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడి ఇప్పుడు తీహాడ్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలు ప్రజల ముందు పెడతామని హెచ్చరించారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి పత్రిక సమావేశాలు పెట్టి బీజేపీకి ఓటేయాలని అడుగుతున్నారని, తెలంగాణలో ఆ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top