ఈతరంభారతం జనగాం జిల్లా 30.3.25 : జిల్లా పరిధిలోని శ్రీ వీరాచల జీడికంటి శ్రీరామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఉగాది పర్వదిన సందర్భంగా ఆదివారం స్వామి వారు, అమ్మవార్ల ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. భక్తుల భక్తి ప్రపత్తుల మధ్య, పేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ మాడవీధుల్లో సంప్రదాయ రీతిలో ఈ ఊరేగింపు కన్నుల పండువగా జరిగి ముగిసింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి సి వంశీ, దేవస్థానం చైర్మన్ యేలే నరసింహులు( మూర్తి), కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
