గద్వాల జూన్ 1 (eetaram bharatam news);: గద్వాల జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంచోటుచేసుకుంది. ఎర్రవల్లి చౌరస్తా వద్ద లారీ-కారు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. రోడ్డు పై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది
