కామారెడ్డి మార్చ్ 30 (ఈతరం భారతం న్యూస్ );: తెలంగాణలో బిఆర్ఎస్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు బిఆర్ఎస్ పార్టీని వదిలిపెడుతున్న తరుణంలో కామారెడ్డిలో మున్సిపాలిటీ బిఆర్ఎస్ చేజారిపోయింది. కామారెడ్డి బిఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె చైర్మన్ పదవిని కోల్పోయారు. కొత్త మున్సిపల్ చైర్ పర్సన్‌గా కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన జాహ్నవిపై సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేశారు. 9 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి సహకరించారు.49 మంది కౌన్సిలర్లకు గాను 27 మంది అవిశ్వాసానికి మద్దతుగా నిలిచారు. ఇందులో 9 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు. వారు వెళ్లిపోగా బిఆర్ఎస్‌కు 16 మంది ఉన్నారు. బిజెపికి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు అవిశ్వాసానికి హాజరు కాలేదు. అవిశ్వాసానికి మద్దతుగా చేతులు లేపిన బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. కొత్త మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన ఇందుప్రియ కామారెడ్డి 8వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె బిఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.