కరీంనగర్ ఫిబ్రవరి 11 (ఈతరం భారతం) కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్, నిజాంబాద్,అదిలాబాద్, కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ నామినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి పోటాపోటీలో బరిలో నిలిచారు. ఈసందర్బంగా న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గ్రాడ్యుయేట్స్ కు మరియు టీచర్స్ కు విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటుని విద్యార్థుల పక్షాన టీచర్ల పక్షాన పోరాడే తత్వం గల , హక్కులను సాధించే విధంగా దశ దిశల ముందుకెళ్లే తనకు వేసి గెలిపించాలని కోరారు. ఘనతగల ఢిల్లీ వరకు గొంతు విప్పే ప్రజల పక్షాన పోరాడే మేధావి వర్గానికి చెందిన, అత్యుత్తమ స్థాయిలో విద్యను అభ్యసించిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్స్ కి మరియు టీచర్స్ కి పేరుపేరునా విజ్ఞప్తి చేశారు.