ఈతరంభారతం హైదరాబాద్ ప్రతినిధి మే 19 24 : ఎల్ఐసి హుజురాబాద్ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ అల్లి మహేందర్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం మహేందర్ శనివారం రాత్రి చాతీ లో నొప్పిగా ఉండడంతో అతన్ని హన్మకొండ లోని ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అయితే ఆయన అక్కడే మృతి చెందారు. అల్లి మహేందర్ కి భార్య సునీత ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంది.
