ఈతరం భారతం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ ఖమ్మం ఏప్రిల్ 13 : వివాహేతర సంబంధం..తో భర్తను హత్య చేసేందుకు కుట్ర.హత్య చేయించేందుకు 20 లక్షల సుపారీ…అడ్వాన్స్ గా 5 లక్షలు.5 గురు నిందుతులు అరెస్ట్ ..రిమాండ్ కు తరలింపు.ఆయుధాలు, 90 వేల నగదు, 5 cell Phone’s Creta TS 04 EH 5679 కారు స్వాధీనం.కేసు వివరాలు వెల్లడించిన ఖమ్మం ఖానాపురం హవేలీ ఇన్స్‌పెక్టర్..భానుప్రకాశ్..
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపూరం గ్రామానికి చెందన తొట దర్మ అనే వ్యక్తి భార్యతో అదే గ్రామానికి చెందిన కొండూరి రామంజనేయులు @రాము అనే వ్యక్తి కి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భర్త దర్మకు ఈ అక్రమ సంబంధం విషయం తెలిసి భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఎలాగైనా ప్రియురాలి భర్త అడ్డు తొలగించి అక్రమ సంబంధం కొనసాగించాలని హత్య కు ప్రణాళిక రచించిన A1 నిందుతుడు కొండూరి రామంజనేయులు ముందుగా ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన A2) దంతాల వెంకట నారాయణ @ రాము అనే వ్యక్తి దర్మ ను హత్య చేయాలనే విషయాన్ని వివరించాడు. దాంతో వెంకట్ తన స్నేహితుడైన రౌడీ షిటర్ అయిన A3) పగాడాల విజయ్ కుమార్ @చంటి’ని A1 నిందుతుడు కు పరిచయం చేశాడు.
హత్య కు 20 లక్షల రూపాయలు సుపారీ గా ఒప్పుకున్నారు. అడ్వాన్స్ గా 5 లక్షలు తీసుకొన్నారు. పధకం ప్రకారం గత నెల 12 న (మార్చి 12) శశి డాబా దంసాలపురం వద్ద తోట దర్మ ను కిడ్నాప్ చేసిన నిందుతులు పలు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి A1 నిందుతుడు కు వీడియో కాల్ ద్వారా దర్మ ను చూపించి నిర్ధారించుకున్నారు. హత్య చేస్తామని మరికొంత డబ్బు చెల్లించాలని రాము ను నిందుతులు అడిగారు. కాల్ కట్ చేసిన రాము పలుమార్లు కాల్ చేసిన స్పందించలేదు… దింతో విసుగు చెందిన నిందుతులు బంధించిన దర్మ ను బెదిరించి ఫోన్ పే ద్వారా లక్ష యాబై వేల రూపాయల నగదు, బంగారు గొలుసు తీసుకొని వదిలి పెట్టి వెళిపోయారు.
బాధితుడు దర్మ తనకు ప్రాణహాని వుందని ఏప్రియల్ 11 న ఇచ్చిన ఫిర్యాదుతొ కేసు నమోదు చేసి టౌన్ ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపిన ఖానాపురం హవేలీ పోలీసులు ఆదివారం నగరంలోని చెరుకూరి మామిడి తోటలో సమావేశం అయినట్లు అందిన విశ్వసనీయ సమాచారంతొ నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్‌పెక్టర్ తెలిపారు. నిందుతుల నుండి 1) రెండు కత్తులు, 2) ఎయిర్ గన్, 3) 90 వేల నగదు, 4) సెల్ ఫోన్లు, 5) కారు TS 04 EH 5679 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.