హైదరాబాద్, జనవరి1 (ఈతరంభారతం) నలుబోల మధు శ్రీ: నామ సేవా సమితి ఆధ్వర్యంలో ముద్రించిన 2025 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను బీఆర్ఎస్ మాజీ లోక్‌సభపక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు బుధవారం నాడు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నందు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం లో ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని కోరారు. నామ సేవా సమితి ఆద్వర్యం లో జరిగే సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు సామాజిక సేవలో ముందు ఉండి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని సభ్యులకు సూచించారు. సమితి సభ్యుల నిబద్ధతతో సమాజానికి మరింత సేవ అందించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజా సేవకు అంకితభావంతో పని చేస్తూ, నూతన సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ కార్యక్రమం ద్వారా ప్రతిపాదించారు.
కార్యక్రమంలో నామ సేవా సమితి అధ్యక్షుడు పాల్వంచ రాజేష్, రేగళ్ల కృష్ణప్రసాద్, పగడాల రవి, దేవభక్తుని నవీన్, మంకెన అజయ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.