ఖమ్మం, ఈతరంభారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
అక్టోబర్ 28: స్థానిక 49 డివిజన్ దానవాయిగూడెం కు చెందిన వంగ శ్రీనివాసరావు సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ బి ఆర్ ఎస్ నాయకులు తోట రామారావు మృతదేహం సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వంగ శ్రీనివాసరావు నిరుపేద కుటుంబం కుటుంబం. తక్షణ సహాయంగా తోట రామారావు ఆ కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తోట రామారావు గారు మాట్లాడుతూ తనకు తోచినంత ఆర్థిక సాయం అందించను అని తెలియజేసినారు. ప్రభుత్వం నుండి వచ్చే ఏ ఆర్థిక సహాయం ఏమైనా ఉంటే దగ్గరుండి ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జి. నరసింహారావు, సిహెచ్ వీరభద్రం, రుద్ర రమేష్, వంగ శ్యాము, లింగారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు