ఈ తరం భారతం అసిఫాబాద్ 28.3.25 : ముందుగానే శుభలేఖలను కూడా ఆ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటున్నట్లు అచ్చు వేయించాడు 500 మంది అతిథుల సమక్షంలో ఆ ఇద్దరి మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత ఆ జంటను.. సారీ, ముగ్గురు కదా, జంట అనలేం.. ఆ భర్త… భార్యలను అతిథులందరూ ఆశీర్వదించారు..కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ఫోటోలు, శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ యువకుడు ఇద్దరు యువతులతోనూ ప్రేమలో పడటం. ఆ విషయం తెలిసి కూడా ఇద్దరి యువతులు యువకుడితో కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నారు. ఓకే వేదికపై ఈ పెళ్లి తంతు జరగడం విశేషం.యువకుడు మామూలు రైతు కుటుంబంలో జన్మించాడు., మూడేళ్ల కిందట మొదలైన అతడి ప్రేమ ప్రస్థానం ఇలా సాగింది..
