EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండి-  శాసనసభలో డా.పాల్వాయి హరీష్ బాబు ఆగ్రహం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండి-

 శాసనసభలో డా.పాల్వాయి హరీష్ బాబు ఆగ్రహం

హైదరాబాద్ : ఈతరంభారతం : 30.07.2024 : నిధులు కేటాయించని పక్షం లో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను మహారాష్ట్రలో కలిపేయండి- శాసనసభలో సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శాసనసభలో డా.పాల్వాయి హరీష్ బాబు ఆగ్రహంశాసనసభలో ఈరోజు సాగునీటి రంగం మరియు సివిల్ సప్లైస్ పై జరిగిన పద్దుల చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు నిధులు కేటాయించని పక్షంలో పక్కనే ఉన్న మహారాష్ట్రలో కలిపేయమని డిమాండ్ చేశారు. తమ ఆవేదనను సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నామని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం శాసనసభ కమిటీ వేయాలని, వెనకబాటుతనంపై అధ్యయన మరియు పరిష్కార మార్గాలు సూచించాలని కోరారు.అలాగే తుమ్మిడి హెట్టి వద్ద డా.బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని, జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు, ఆడ ప్రాజెక్టులను పూర్తిచేయాలని , పిపిరావు ప్రాజెక్టు పూడిక తీసి 11 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని కోరారు.గత ప్రభుత్వం కేవలం దక్షిణ తెలంగాణకు నీళ్లు తరలించి ఉత్తర తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని, వాటిని సవరించాలని కోరారు.కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు రోడ్ల నిర్మాణం కోసం రూ.12 కోట్ల నిధులు అటవీ శాఖకు చెల్లించాలని కోరారు.

Related News

Select the Topic
Scroll to Top