మెదక్ మే 16 (ఈతరం భారతం న్యూ స్);: ట్రేడ్ లైసెన్స్ జారీ కోసం రూ.30 వేలు లంచం తీసకుంటూ వ్యవసాయాధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లానర్సాపూర్ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ కె.సెదర్శన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరా క్యాంప్ గ్రామానికి చెందిన రైతు వంగా నరేశ్ ట్రేడ్ లైసెన్స్ జారీ కోసం నర్సాపూర్ వ్యవసాయాధికారి అనిల్ కుమార్‌ను సంప్రదించాడు.దీనికి ఏవో అనిల్‌కుమార్ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి లంచం తీసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను సంప్రదించాలని సూచించారు.