దేశం లోనే అతి పెద్ద ఏకశిలా వినాయకుడి విగ్రహం
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 9 (ఈతరం భారతం); నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంఛలో దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం ఉంది. ఈ గణేషుడి విగ్రహం దేశంలోనే అత్యంత పురాతన ఏకశిలాతో చేసిన గణపతిగా పేరుంది. ఈ గణేషుడి విగ్రహం 9వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహం ఎత్తు 30 అడుగులు కాగా వెడెల్పు 15 అడుగులు.కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు రామోజు హరగోపాల్ ప్రకారం సుమారు 879 ఏండ్ల కిందట అంటే క్రీ.శ 1140లో ఈ విగ్రహాన్ని తైలంపుడు అనే రాజు ఏకశిలపై చెక్కించాడు. ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాగా పిలవబడుతున్న ప్రాంతం అప్పట్లో బాదామి రాజ్యంగా ఉండేది. మహబూబ్ నగర్ జిల్లా అవంఛ గ్రామా శివారుల్లో ఉన్న ఈ విగ్రహాన్ని చూసేందకు జనాలు గుంపులు గుంపులుగా తరలి వస్తున్నారు. ఇదిలా ఉండగా కళ్యాణ చాళుక్యుల కాలంలోనే క్రీస్తు శకం 11 శతాబ్దంలో చెక్కిన మరొక విగ్రహం సిద్దిపేట జిల్లాలోని బైరాన్ పల్లి గ్రామంలో ఉంది. ఆనాటి పాలకులు, హిందూ మతానికి, శిల్ప సౌందర్యానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఈ శిల్పాల్లో కనపడుతుంది
.