Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

కగార్ పేరుతో జరుగుతున్న హత్యలను వెంటనే ఆపాలి

నిర్మల్ మార్చి 29 (ఈ తరం భారతం);మార్చి 1 నుండి 30 వరకు రెండు తెలుగు రాష్ట్రాలల్లో మార్చి-8, 115 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడభ్ల్యూ-విముక్తి) ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల కమిటీలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపులో బాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని టి.ఎన్.జీ.భవన్లో ఘనంగా నిర్వహించారు. బీడి కార్మిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్న కార్యక్రమంలో సంఘం నాయకురాలు పి.సునిత అధ్యక్షతన 2025, మార్చి-29, శనివారం రోజున జరిగిన కార్యక్రమానికి సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్ పాల్గొని ప్రసంగించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మధ్య భారతదేశంలో జరుగుతున్న హత్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఆకశంలో సగం, మానవ జాతిలో సగ బాగమైన మహిళలు అన్నిరకాల అసమానతలు, దోపిడీ, పీడన, అణిచివేత, వివక్షతలను నేటికీ ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా 300 మందికి పైగా సామాన్య ఆదివాసి మహిళలను, పిల్లలను, యువకులను పొట్టనపెట్టుకుందని, సుమారు 400 మందికి పైగా మావోయిస్టులను కేంద్ర సైనిక బలగాలు ఎన్ కౌంటర్ పేరుతో హతమార్చారని ఆరోపించారు. గిరిజనుల పాదాల క్రింద ఉన్న అటవి భూములలో అపారమైన సంపదలు ఉన్నాయని, వాటిని బడా కార్పొరేట్ శక్తుల దోపిడీకి గురికాకుండా ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుకొంటున్న ఆదివాసి గిరిజన ప్రజలను మావోయిస్టులుగా ముద్రవేసి, వారిని అడవి నుండి బలవంతంగా గెంటివేసే కుట్రలో బాగంగానే అంతిమ యుద్దం పేరుతో జరుపుతున్న సామూహిక అత్యచారాలు, హత్యలను తీవ్రంగా ఖండించారు. 115 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినాన్ని పురస్కరించుకుని ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా సంఘటితంగా ఆదివాసుల జీవించే హక్కుకై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలోని మహిళల కట్టు, బొట్టు ఆచారాలతో పాటు ఆట, పాట, పని, చదువు, ఉద్యోగాల విషయాల్లో చులకన చేయబడుతున్నారని తెలంగాణ రైతు-కూలీ సంఘం రాష్ట్ర కన్వీనర్ నకిరేకంటి చిట్టిబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సామ్రాజ్యవాద విష సంస్కృతిలో బాగంగా మార్కెట్లో సరుకుగా చూసే ప్రపంచ సుందరిమణుల అందాల పోటీలు హైదరాబాద్ లో నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. యావత్ శ్రామిక మహిళాలోకం పురుషాధిక్యత, కుటుంబ హింసకు వ్యతిరేకంగా హక్కుల సాధన, స్త్రీ స్వేచ్చ, స్త్రీ పురుష సమానత్వం, సమానవేతనం కోసం పోరాడుతూనే స్త్రీలపై బానిసత్వాన్ని రుద్దే బ్రాహ్మణీయ మనువాద పితృస్వామ్యంపై సంఘటితంగా ఉద్యమించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐ.ఎఫ్.టి.యు.- (ఇఫ్టూ)) రాష్ట్ర అధ్యకుడు ఎన్. సుదాకర్ కోరారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అప్రజాస్వామిక, ప్రజావ్యతిరే విధానాల మూలంగా పురుషులతో పాటు స్త్రీలు కూడ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో వెనుకబడి, కనీస జీవన ప్రమాణాలకు దూరం అవుతున్న నేపథ్యంలో మౌనాన్ని వీడి, దోపిడీ, పీడన, అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పీఓడభ్ల్యూ-బీడి కార్మిక మహిళా సంఘం సిహెచ్ కళక్క సూచించారు. మణిపూర్, హర్యాన, గుజరాత్, ఢిల్లీ, ఉత్తర, మద్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రాజ్యా అణిచివేతలో బాగంగా మహిళలపై జరుగుతున్న హత్యలు, సామూహిక అత్యాచారాలకు వ్యతిరేకంగా శ్రామిక మహిళలు వర్గపోరాటాలలో బాగస్వామ్యం కావాలని కె. సంజీవ్ విజ్ఞప్తి చేశారు. బీడి కార్మిక హక్కుల పరిరక్షణకు, కరువు భత్యం, బోనస్, పెన్షన్లు, మెరుగైన వేతనాలు, ఉచిత వైద్యం తదితర సమస్యలపై సంఘటితంగా ఉద్యమించాలని ఇఫ్టూ జాతీయ కన్వీనర్ షేక్ షావలి పిలుపునిచ్చారు.ప్రజల ప్రజాస్వామ్య హక్కులతో పాటు బలమైన విప్లవ శ్రామిక మహిళా పోరాట నిర్మాణానికై కృషి చేయవలసిందిగా పీఓడభ్ల్యూ(విముక్తి)జాతీయ కన్వీనర్ సంపంగి పద్మ కోరారు.

Related News

Select the Topic
Scroll to Top

Web Design, Data Processing, Data Entry in Telugu, English & Hindi,
Flyer Designing for Social Media, Video Flyers, Social Media Postings. WhatsApp: 8919646204

Web Design, Data Processing, Data Entry in Telugu, English & Hindi,
Flyer Designing for Social Media, Video Flyers, Social Media Postings. WhatsApp: 8919646204