ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తా
నిర్మల్ ఆగష్టు 9 (ఈతరం భారతం); ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు..ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఆదివాసీ గిరిజన వీరులు రాంజిగొండు, కొమురం భీం విగ్రహాలను పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…నిర్మల్ జిల్లాలో ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తానని తెలిపారు. వారికి అవసరమైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యం గా నిలిచిన నిర్మల్ లోని వెయ్యి ఉరుల మర్రి ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివాసీల అభ్యున్నతికి అన్ని విధాలా పాటుపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, జిల్లా బీజేపీ నాయకులు, గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.